బి.కొత్తకోట(పెద్దతిప్పసముద్రం): స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా రిజిస్ట్రార్ ఉమా మహేశ్వరి అకస్మికంగా తనిఖీ చేశారు. కీలకమైన రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం ఆమె కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మమేకమై సిబ్బంది పని తీరు, సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా, కాలయాపన చేస్తూ పనుల కోసం తిప్పుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ అర్జీదారులతో దురుసుగా ప్రవర్తిస్తూ, లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని పలువురు జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు.


