అటల్‌ ల్యాబ్‌లను ఆవిష్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

అటల్‌ ల్యాబ్‌లను ఆవిష్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

రాయచోటి : అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను క్రియాత్మక ఆవిష్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయులకు సూచించారు. రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అటల్‌ బూట్‌ క్యాంపును డీఈఓ శనివారం సందర్శించారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ అటల్‌ ల్యాబ్‌లలోని మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని విద్యార్థులతో నిరంతరం ప్రయోగాలు చేయించి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలని, తద్వారా నైపుణ్యాలు కల్గిన విద్యార్థులను అన్వేషణలవైపు నడిపించవచ్చని సూచించారు. జిల్లాలోని 24 అటల్‌ ల్యాబ్‌లలో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు మూడురోజులపాటు ప్రత్యక్షానుభవన కార్యాశాలను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆయన విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన నలభై మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌అధికారి మార్ల ఓబుల్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కార్యదర్శి వీరాంజనేయులు, ఏపీఓ రవీంద్ర, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, అటల్‌ డీఆర్‌పీ సెట్టెం ఆంజనేయులు, మెంటార్‌ అంకిత తదితరులు పాల్గొన్నారు.

డీఈఓ సుబ్రమణ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement