ఆయకట్టు.. అక్రమార్కులే చుట్టూ ! | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టు.. అక్రమార్కులే చుట్టూ !

Mar 20 2026 8:17 AM | Updated on Mar 20 2026 8:17 AM

పీలేరులో అడ్డూఅదుపులేని

చెరువుల ఆక్రమణలు

కుంచించుకుపోతున్న జలవనరులు

అధికారుల నిర్లక్ష్యంపై

ఆయకట్టుదారుల ఆగ్రహం

పీలేరు: మండలంలోని చెరువులు అక్రమార్కుల పాలి ట వరంగా మారుతున్నాయి. అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న ఆక్రమణలతో ఒకప్పుడు జలకళతో ఉట్టిప డిన చెరువులు నేడు కుచించుకుపోతున్నాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కబ్జాదారులు చెరువు భూములను ఆక్రమిస్తున్నారని ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేల ఎకరాల ఆయకట్టుకు ముప్పు

పీలేరు మండల వ్యాప్తంగా మొత్తం 188 చెరువులు ఉండగా, వీటి కింద 1,795 ఎకరాల సాగు భూమి (ఆయకట్టు) ఉంది. ఇందులో మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు కలిగిన ఐదు ప్రధాన చెరువులు ఉన్నాయి

భూగర్భ జలాలపై పెను ప్రభావం

ఆక్రమణలకు తోడు, కొందరు మట్టిని యథేచ్ఛగా తోడేస్తుండటంతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతోంది. దీనివల్ల వర్షాలు కురిసినా నీరు నిలవడం లేదని, ఫలితంగా చుట్టుపక్కల బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు:

ఇప్పటికై నా రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. చెరువుల హద్దులను గుర్తించి, ఆక్రమణలను తొలగించి జలవనరులను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయ్యపునాయుని చెరువు : 252 ఎకరాలు

కుమ్మరపల్లె చెరువు : 252 ఎకరాలు

గోవిందరెడ్డిపల్లె చెరువు : 200 ఎకరాలు

చింతల చెరువు : 106 ఎకరాలు

గూడరేవుపల్లె సూరప్ప చెరువు : 104 ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement