బి.కొత్తకోట: అకాల వర్షంతో బుధవారం రాత్రి బి.కొత్తకోటలో ఓ ఇంటిపై పిడుగు పడింది. స్థానిక బీసీ కాలనీలోని శెట్టిపల్లి రోడ్డులో హైదర్ వల్లి నివాసం అంటున్నారు. ఈమధ్య ఇంటిపై మరో ఇంటి నిర్మాణం పనులు చేశారు. ఈ ఇల్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండగా రాత్రి పిడుగు పడింది. దీని ప్రభావానికి గోడ పైకప్పు దెబ్బతింది. ఇంటిలోని ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్ బోర్డులు, మిగతా విద్యుత్ సామాగ్రి కాలిపోయింది. దీంతో బాధితులు నష్టపోయారు. జరిగిన నష్టానికి అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
గేట్ పరీక్షలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రతిభ
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్న కేశంరెడ్డి శ్రీవిద్య గురువారం విడుదలైన గేట్ పరీక్షా ఫలితాల్లో ఆల్ ఇండియాలో 452వ ర్యాంక్ సాధించింది. లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన చంద్ర ప్రతాప్‌రెడ్డి, నాగజ్యోతి దంపతుల కుమార్తె కె.శ్రీవిద్య ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని ప్రతిభపై ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తతోపాటు అధ్యా పక బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని అభినందించారు.


