ప్రొద్దుటూరు : స్థానిక శ్రీరాములపేటలోని ఉపాధ్యాయ సేవా కేంద్రంలో గురువారం విజ్ఞాన సేవా సమితి వారి స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర క్యాలెండర్‌ను ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్టీఆర్ వైద్య విద్యాలయ పాలకమండలి సభ్యుడు డాక్టర్ టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని కాపాడాలనే సంకల్పంతో సామాన్య తెలుగు ప్రజలకు ఉపయోగపడే ఈ కాలమానిని తయారు చేసిన విజ్ఞాన సేవా సమితి కృషిని కొనియాడారు. ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య, కోశాధికారి బోగా గంగాధర్, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, సుధాకర్, రిజ్వాన్ ఆలీ, షేక్‌షావల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


