వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై అక్రమ కేసులు
● స్టేషన్‌కు పిలిపించి వేధింపులు
● మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేతల రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా.. సంబేపల్లె మండలానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత, వర్గీయులపై తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగాయి. మంత్రి ఏర్పాటు చేసిన శిలా ఫలకాలపై తొలగిన స్టిక్కర్లను.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తొలగించారంటూ సంబేపల్లె మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు వి.వి.ప్రతాప్‌రెడ్డి, సోషల్ మీడియా డిస్ట్రిక్ మెంబర్ బాలాజి, కదిరప్ప, రవీంద్రలపై తప్పుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు మరో అడుగు ముందుకు వేసి స్టేషన్‌కు పిలిపించి వేధించడం.. సొంత పార్టీలోని మిగిలిన వర్గాలను సైతం ముక్కున వేలు వేసుకొనేలా చేసింది.
● కేవలం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో స్టిక్కర్లను తొలగించడాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై కేసు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. శుక్రవారం సంబేపల్లె మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకొన్న సంఘటన అధికార పార్టీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తలపించింది. సంబేపల్లె మండలంలోని శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ ఆలయ సమీపంలో రోడ్డుకు, నారాయణరెడ్డిపల్లె గ్రామంలోని యర్రగుంట్ల బస్టాప్ సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్టిక్కర్లను తొలగించారని.. వైఎస్‌ఆర్‌సీపీ నాయుడు, కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రూరల్ సీఐ రోషన్, ఎస్ రవికుమార్‌లు విచారణ చేశారు. ఎటువంటి ఆధారాలు లేక పోవడంతో వారికి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించేశారు.
భారీగా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరిక
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు వి.వి.ప్రతాప్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిని పోలీసులు విచారణ చేస్తున్నారని తెలియడంతో.. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రనాథ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డితోపాటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున సంబేపల్లె స్టేషన్ వద్దకు చేరుకొన్నారు. ఎవరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ నాయకుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అండతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేత వి.వి.ప్రతాప్‌రెడ్డితో మాట్లాడుతున్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి
సంబేపల్లె పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు
వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై అక్రమ కేసులు


