సంస్థాగతంగా మరింత బలపడితే వైఎస్సార్‌సీపీకి తిరుగులేదు
● జగన్ సీఎం కావాలని
ప్రజలు కోరుకుంటున్నారు
● కమిటీల్లోని కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత
● చంద్రబాబుది ప్రాంతానికో మాట
● మదనపల్లె, తంబళ్లపల్లె సంస్థాగత ఎన్నికల
సమావేశంలో ఆకేపాటి అమరనాథరెడ్డి
మదనపల్లె : సంస్థాగతంగా మరింత బలపడితే ఏ ఎన్నిక జరిగినా వైఎస్సార్‌సీపీకి తిరుగుండదని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. శుక్రవారం మదనపల్లెలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీల ఏర్పాటుపై మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై పార్టీ నేత వజ్ర భాస్కర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ సంస్థాగతంగా మరింత బలపడటంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సూచించిన ప్రణాళిక, కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేస్తే మరో వందేళ్లు పార్టీ మనుగడకు డోఖా ఉండదని అన్నారు. వచ్చేరోజుల్లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. నిజమైన కార్యకర్తలను కమిటీల్లోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వీరికి రాజకీయంగా ప్రాధ్యానత, పదవుల్లో అవకాశాలు ఉంటాయని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కమిటీల పాత్ర కీలకమవుతుందన్నారు. హామీలతో నమ్మించి మోసం చేసిన సీఎం చంద్రబాబును ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజలు ఏమి నష్టపోయారో గుర్తించారని అన్నారు. రాష్ట్రం కోసం జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలో అందరినీ సమానంగా చూడాలన్నదే జగన్ ఆశయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా మహిళలకు 50శాతం సీట్లు ఇచ్చారన్నారు. జిల్లా కేంద్రం విషయంలో చంద్రబాబు రాజంపేటలో ఒకమాట, రాయచోటిలో ఇంకోమాట, మదనపల్లెలో మరోమాట..ఇలా నిలకడలేని వాగ్దానాలతో ప్రజలను మోసం చేశారన్నారు.
● తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లెలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా వాటిని ఎదుర్కొని విజయం సాధించే సత్తా కలిగిన నాయకులు నియోజకవర్గంలో ఉన్నారని అన్నారు. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించామని అన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో మంచి ఫలితాలు సాధించుకొచ్చే రాజకీయ అనుభవం తమ నియోజకవర్గ నాయకుల్లో ఉందని చెప్పారు. పార్టీ సంస్థాగత కమిటీల ఎన్నికలపై ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ సూచించిన విధంగా కమిటీల్లో క్రియాశీల కార్యకర్తలకు అవకాశం కల్పించాలన్నారు. కార్యకర్తలే నాయకులయ్యే పరిస్థితులు ఉంటాయన్నారు.
● మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 30 ఏళ్లు సీఎంగా ఉండేలా పార్టీ సంస్థాగత నిర్మాణం జరగాలన్నారు. పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు సంస్థాగత ప్రణాళికను పక్కాగా పాటించాలన్నారు. పార్టీ మరింత బలోపేతం కావడం కోసం ప్రతికార్యకర్త కృషి చేయాలన్నారు. సంస్థాగత నిర్మాణంలో పుంగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
● పార్టీ పరిశీలకురాలు ఎన్.అనీషారెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపుతోపాటు నాయకులై పదవులు దక్కుతాయన్నారు. గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తున్న కమిటీలతో కార్యకర్తలు, నాయకుల మధ్య అంతరం తొలగిపోతుందన్నారు. ఒకఫోన్‌కాల్‌తో పార్టీనేతలు అందుబాటులోకి వచ్చే వ్యవస్థను తీసుకొస్తున్నారని, ఇకపై కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతిగ్రామంలో పార్టీ మరింత పటిష్టం కావాలన్నారు.
సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జి.షమీంఅస్లాం, మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ, వైస్ చైర్మన్లు జింకా వెంకటా చలపతి, నూర్‌ఆజం, రాష్ట్ర కార్యదర్శి ఉదయ్‌కుమార్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు సాంబశివ, జెడ్పీటీసీలు సీహెచ్.రామచంద్రారెడ్డి, రామచంద్ర, ఎంపీపీలు మొహమూద్, భూదేవి, పూర్ణచంద్రిక, రెడ్డెమ్మ, సాయిలీలా, మండలాల అధ్యక్షులు కే.మోహన్‌రెడ్డి, చౌడేశ్వర, కరుణాకర్‌రెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాసులు, కౌన్సిలర్లు షబానా, బిఏ.ఖాజా, ప్రసాద్‌బాబు, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్.రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, వినుతాబాయి, శారదరెడ్డి, ఎస్‌ఎస్.ఫయాజ్, అంజద్‌ఖాన్, ఆర్‌సీ.ఈశ్వర్‌రెడ్డి, సర్పంచులు జయరామిరెడ్డి, ఉమమహేశ్వరీ, కొత్తపల్లె మహేష్‌బాబు, రేవతి, నాగమణి, లలితారాణి, అభిలాష్‌రెడ్డి, మంజుల పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల శ్రేణులు, సమావేశంలో మాట్లాడుతున్న ఆకేపాటి అమరనాథరెడ్డి,
చిత్రంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్, పరిశీలకురాలు అనీషారెడ్డి తదితరులు
సంస్థాగతంగా మరింత బలపడితే వైఎస్సార్‌సీపీకి తిరుగులేదు


