జేఎల్‌ఎం సస్పెన్షన్
రాజంపేట రూరల్: విధులలో అలసత్వం వహించినందుకు పుల్లంపేట మండలం అనంతసముద్రం జేఎల్‌ఎం శివారెడ్డిని సస్పెన్షన్ చేసినట్లు విద్యుత్‌శాఖ ఈఈ ఎన్.రాజశేఖరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
మదనపల్లె సిటీ: ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధికారి రవి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీని సందర్శించారు. జిల్లా పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మారింది. బోర్డు కార్యాలయం ఏర్పాటుకు భవనాల పరిశీలనకు ఆయన వచ్చారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష విధానంలో మార్పులు చేశారన్నారు. కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాలికల జూనియర్ కాలేజీ అధ్యాపకులు నూతన డీఐఈవోను కలిశారు.
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో నేడు (శనివారం) పౌర్ణమి సందర్భంగా సీతారాములకు కల్యాణం నిర్వహించనున్నట్లు శుక్రవారం ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి, సీతారాముల ఉత్సవ విగ్రహాలకు వైభవంగా కల్యాణం నిర్వహించనున్నారు.
ఎస్పీ కార్యాలయం
మదనపల్లె రూరల్: అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఎస్పీ కార్యాలయం ప్రారంభించడానికి పనులు ముమ్మరం చేశారు. ఎీస్పీ కార్యాలయం కోసం ఎంపిక చేసిన రేస్ (రుక్మిణిదేవి అరండల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్) బీఈడీ కాలేజీలో శుక్రవారం పోలీసులు జేసీబీతో పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేపట్టారు. కార్యాలయం ముందు, వెనుక భాగాలలో ఉన్న గడ్డిని తొలగిస్తున్నారు. భవనాలు పాత పడటంతో మరమ్మతుల కోసం శుభ్రం చేస్తున్నారు. పనులను జిల్లా అడిషనల్ ఎస్సీ వెంకట్రాది శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.


