మళ్లీ రీ సర్వే చేయాలి
బ్రాహ్మణ ఒడ్డుపల్లి రెవెన్యూ గ్రామంలో భూముల రీ సర్వే గందరగోళంగా సాగింది. రైతులకు అవగాహన లేకపోవడం, ఆపై ఇష్టానుసారంగా సర్వే నిర్వహణ వల్ల భూ వివరాలు తప్పుగా ఆపై అస్తవ్యస్తంగా నమోదు అయ్యాయి. ఇదివరలో కూడా రీ సర్వేలో తప్పులు ఉన్నాయని అప్పటి జిల్లా కలెక్టర్ దృష్టికి గ్రామస్తులంతా తీసుకెళ్లడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు అవే భూ వివరాలతో పట్టాదారు పుస్తకాలు వచ్చాయి. మరో సారి సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయకపోతే తీవ్రంగా నష్టపోతారు.
–లక్ష్మన్న, బాధిత రైతు, బ్రాహ్మణ ఒడ్డుపల్లి, కురబలకోట మండలం


