భూవివాదంలో దాడులు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణం లక్ష్మీనగర్ పట్టా భూములకు సంబంధించి జరిగిన ఇరువర్గాల దాడులలో శుక్రవారం పది మందికి గాయాలయ్యాయి. లక్ష్మీనగర్‌లోని సర్వే నంబర్ 7–3, 7–5, 7–4, 13–1ఏ పట్టాభూమిని దశాబ్దాల క్రితం100 మందికిపైగా అన్ని వర్గాల పేదలు కొనుగోలు చేసారు. అయితే కోడూరు అరుంధతివాడకు చెందిన వారు కొద్ది రోజులుగా ఈ భూమి తమదేనంటూ గొడవలు పడుతున్నారు. తహసీల్దార్ అమర్‌నాథ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివాద స్థలాన్ని పరిశీలించి భూములు కొన్నవారే హక్కుదారులని నిర్ధారించారు. ఇటీవలే పోలీసుల సహకారంతో జేసీబీలతో చదును చేయించి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డు వేసేందుకు యంత్రాలు పని చేస్తుండగా పోలీసుల సమక్షంలో అరుందతివాడ గ్రామస్తులు అడ్డుకొన్నారు. దీంతో ఇంటి స్థలాలు కొన్న వర్గాలకు, అరుంధతివాడ గ్రామస్తులకు మధ్య గొడవ జరిగి రాళ్లు, కట్టెలతో కొట్టుకొన్నారు. ఈ గొడవలలో అరుంధతి వాడకు చెందిన వారు రాళ్లు రువ్వారు, కర్రలతో దాడులు చేసారు. ఈ క్రమంలో ఇంటి స్థలాలకు చెందిన సుబ్బారెడ్డి, శాంతి, సురేంద్రరాజు, నాగరాజు, అనిల్‌కుమార్, మహేష్, కరీమున్నీసాలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మేరకు ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పలువురికి గాయాలు


