కుక్క అడ్డురావడంతో..
వాల్మీకిపురం/మదనపల్లె రూరల్ : మండలంలోని అయ్యవారిపల్లి సమీపంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పుంగనూరు మండలానికి చెందిన చిరంజీవి క్రిస్మస్ పండుగకు తన చెల్లిలు ప్రభావతి, మేనల్లుడు సంతోష్ కుమార్‌ను పిలుచుకొని వెళ్లేందుకు వాల్మీకిపురం మండలం, దిగువబూడిదవేడు గ్రామానికి వచ్చాడు. ఇక్కడ నుంచి తన స్కూటీపై చెల్లులు ప్రభావతి, మేనల్లుడు సంతోష్ కుమార్‌ను తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని అయ్యవారిపల్లి సమీపంలో స్కూటీకి అడ్డంగా కుక్క దూరడంతో స్కూటీని కంట్రోల్ చేయలేక కిందపడ్డారు. ఈ ప్రమాదంలో చిరంజీవి, ప్రభావతికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మదరసా విద్యార్థి అదృశ్యం
పీలేరు : మండలంలోని వేపులబైలు పంచాయతీలో ఉన్న మదరసా (మస్‌జిద్–ఇ–మస్సేహియా)లోని ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పీలేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కలికిరి మండలం మేడికుర్తికి చెందిన పి. మస్తాన్‌వలి కుమారుడు మహహ్మద్ సిద్ధిక్ (15) వేపులబైలు వద్ద గల మదరసాలో విద్యనభ్యసించేవాడు. ఈ నెల 13న సాయంత్రం మదరసా నుంచి వెళ్లిపోయిన మహమ్మద్ సిద్ధిక్ అనంతరం ఆచూకీ లేదు. మదరసా యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాయచోటి విద్యార్థిని
జాతీయ స్థాయికి ఎంపిక
రాయచోటి అర్బన్ : యువత ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో రాయచోటికి చెందిన అరమాటి సంకీర్తన రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రం నుంచి ఎంపికై న 500 మందికి విజయవాడలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన వికసిత్ భారత్ ఛాలెంజ్‌లో ప్రతిభ కనబరిచి అన్నమయ్య జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికై ంది. దేశాభివృద్ధికి 2047 లక్ష్యంగా నిర్దేశించిన పలు అంశాలపై విద్యార్థులకు చాలెంజ్ నిర్వమించారు. ఈ పోటీలో సంకీర్తన రెడ్డి సాంస్కృతిక దౌత్యం అంశంపై ప్రపంచ ప్రభావం అనే అంశంపై వ్యాసరచనతో పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసింది. అ తరువాత వ్యక్తిగత ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై ంది. జనవరి 12వ తేదీన ప్రధాని మోడీతో దేశాభివృద్ధి, భవిష్యత్ భారత్, వికసిత్ భారత్ అంశాలపై యువత అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని ఆమె దక్కించుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి,పద్మజ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలోనూ సంకీర్తనరెడ్డి ప్రతిభ చాటి అన్నమయ్య జిల్లా పేరు ప్రతిష్టలు పెంచాలని పలువురు ఆకాంక్షించారు.
ప్రమాదంలో గాయపడిన చిరంజీవి, ప్రభావతి
కుక్క అడ్డురావడంతో..
కుక్క అడ్డురావడంతో..
కుక్క అడ్డురావడంతో..


