సౌత్ జోన్ ఫెస్టివల్‌లో ప్రతిభ
వేంపల్లె: సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్స్‌లో ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. చైన్నెలో హిందూస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్స్‌లో దాదాపు 35 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఇందులో ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇండియన్ గ్రూప్ సాంగ్ 5వ స్థానం కై వసం చేసుకున్నారు. విద్యార్థుల ప్రతిభపై డైరెక్టర్ కుమారస్వామి గుప్తా హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
కడప రూరల్: కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో బుధవారం డిప్యూటీ డెమోగా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్న ఏడుగురు హెల్త్ ఎడ్యుకేటర్స్‌కు డిప్యూటీ డెమోగా పదోన్నతులు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య తెలిపారు.
రాయచోటి: అన్నమయ్య జిల్లా విద్యార్థులు హర్షప్రియ, వినయ్‌లు రూపొందించిన ప్రాజెక్టు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 24వ తేదీల్లో రెండు రోజులపాటు విజయవాడలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారన్నారు. అన్ని జిల్లాల నుంచి 286 ప్రాజెక్టులను ప్రదర్శించారన్నారు. సుండుపల్లి మండలం, తిమ్మసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షప్రియ, వినయ్‌లు రూపొందించిన త్రీడీ ఆకారాలను అవగాహన చేసుకొని వినియోగించడం అనే ప్రాజెక్టు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపికై ందన్నారు. వీరు జనవరిలో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో పాల్గొంటారన్నారు. వీరికి ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి మెమెంటో, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. గణిత ఉపాధ్యాయుడు పద్మరాజు, అశోక్ రాజు వీరికి గైడ్ టీచర్‌గా వ్యవహరించారు. జిల్లా విద్యాశాధికారి కె సుబ్రమణ్యం, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవులూరి చంద్రశేఖర్ విద్యార్థులను, గైడ్ టీచర్‌ను అభినందించారు.
సౌత్ జోన్ ఫెస్టివల్‌లో ప్రతిభ


