మెర్రిసే క్రిస్మస్
విద్యుత్ దీపాల వెలుగులో
మదనపల్లెలోని జేసీఎం చర్చి
ఏసు జననం..మహోదయం..సర్వలోకానికి కరుణోదయం. మరియపుత్రుడు భువికేతెంచే క్షణం కోసం హృదయానందంలో జనులు జేజేలు కొడుతున్నారు. క్మిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు క్రైస్తవ లోకం సిద్ధమైంది. మెర్రీ క్రిస్మస్..హ్యాపీ క్రిస్మస్ అంటూ క్రిస్మస్‌కు స్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. తేజోమయుని పుట్టిన ఘడియ రాగానే క్రైస్తవుల సంబరాలు అన్నీ ఇన్నీ కావు. కేక్‌లను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనేక చర్చిల్లో యవ్వనస్తులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు.మార్కెట్లలోనూ క్రిస్మస్ సందడి కనిపించింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని చర్చిల్లో ప్రత్యేక ఆరాధనలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని తెలియజేయజేస్తారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అన్ని చర్చిల్లో సంఘకాపర్లు ప్రేమ విందులను ఏర్పాటు చేశారు. –సాక్షి నెట్‌వర్క్
మెర్రిసే క్రిస్మస్


