ఆర్టీసీ అద్దె బస్సు, లారీ ఢీ
సిద్దవటం : మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారి భాకరాపేట సమీపంలోని మలినేనిపట్నం కాలనీ వద్ద బుధవారం ఆర్టీసీ అద్దె బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. రాజంపేట ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు కడప నుంచి రాజంపేట వైపు వెళ్తుండగా పూణే నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా వెళ్తూ హైవేపై నిలుపుదల చేయడంతో లారీ వెనుక ఉన్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ అద్దె బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సు డ్రవైర్ మహేంద్ర మాట్లాడుతూ హైవే రోడ్డుపై ఒక్కసారిగా లారీ బ్రేక్ వేయడంతో లారీ వెనుక ఉన్న బస్సు ఢీకొందన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు. సంఘటన స్థలాన్ని హైవే పెట్రోలింగ్ పోలీసులు పరిశీలించారు.
రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడికి తీవ్ర గాయాలు
కడప కోటిరెడ్డిసర్కిల్/నందలూరు : అన్నమయ్య జిల్లా నందలూరు రైల్వే స్టేషన్ యాడ్ సమీపంలో 30 సంవత్సరాల వయస్సుగల గుర్తు తెలియని యువకుడు గూడ్స్ రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారాన్ని అందుకున్న ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది క్షతగాత్రుడిని తొలుత రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతరం కడప రిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మాట్లాడే స్థితిలో లేకున్న ఆ యువకుడి వివరాలు తెలియాల్సింది. ఇతనికి సంబంధించిన వారు తమను సంప్రదించాలని కడప రైల్వే పోలీసులు తెలిపారు.
జూదరుల అరెస్టు
రాయచోటి : రాయచోటి రూరల్ మండల పరిధిలోని శిబ్యాల గ్రామం సిద్ధారెడ్డి గారిపల్లెలో పేకాట స్థావరంపై బుధవారం దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ ఎస్‌ఐ విష్ణువర్దన్ తెలిపారు. వారి నుంచి రూ.8900 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడి సమయంలో మరో ముగ్గురు తప్పించుకొని పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్టీసీ అద్దె బస్సు, లారీ ఢీ


