జిల్లా కేంద్రం కోసం ‘న్యాయ’పోరాటం
రాజంపేట : భావితరాల ఉజ్జ్వల భవిష్యత్తుకు రాజంపేట జిల్లా కేంద్రం చేయాల్సిన అవసరం ఉందని రాజంపేట న్యాయవాదుల జేఏసీ ప్రతినిధి కొండూరు శరత్‌కుమార్‌రాజు డిమాండ్ చేశారు. బుధవారం కోర్టు క్లాంపెక్స్ నుంచి రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు, రైల్వేకోడూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామరాజు, నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి నరసింహులు నేతృత్వంలో న్యాయవాదులు జిల్లా కేంద్రం కావాలనే డిమాండ్‌తో నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు జాఫర్, రామచంద్రరాజు, వల్లభరావు, సురేష్‌బాబు, ఇందిర, కరణం శివశంకర్‌నాయుడు, ఛాయాదేవి, మురళి, వెంకటసుబ్బయ్య, నాగేంద్ర, మౌలా, బాలాజీనాయుడు, కేఎంఎల్ నరసింహ, గోవర్దన్‌రెడ్డి, ప్రభాకర్, తౌఫిక్, శివ, రాజశేఖర్, రవిశంకర్, అక్షయ్‌కుమార్, వెంకటరమణ, చంద్రమౌళి, శ్రీకాంత్, షాహిద్, కోటేశ్వరరావు, మస్తాన్, శోభారాణి, సాయిప్రశాంతి, శబరి పాల్గొన్నారు.
రాజంపేట కోసం ఆమరణదీక్షకై నా సిద్ధం
రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రంగా ఎంపిక చేసేంతవరకు పోరాటం ఆగదని, అవసరమైతే ఆమరణదీక్షకై నా తాను సిద్ధమని రాజంపేట మున్సిపల్ వైస్‌చైర్మన్ మర్రి రవికుమార్ ప్రకటించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం19వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని గత ఎన్నికల సభలో రాజంపేట వాసుల సాక్షిగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. కార్యక్రమంలో మేధావులు, సంఘసేవకులు, స్ధానికులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షకు న్యాయవాదులు సందర్శించి, సంఘీభావం తెలిపారు.
జిల్లా కేంద్రం కోసం ‘న్యాయ’పోరాటం


