కూచ్‌బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. బుధవారం కడప వేదికగా వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్లు తలపడ్డాయి. తొలి రోజు టాస్ గెలిచిన ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టు నిర్ణీత 66.2 ఓవర్లకు 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని వన్ష్ ఆచార్య 134 బంతుల్లో 18 ఫోర్లతో 124 పరుగులు, హర్వాన్ష్ సింగ్ 27 పరుగులు చేశారు. ఆంధ్ర జట్టులోని తోషిత్ యాదవ్ 14 ఓవర్లకు 50 పరుగులిచ్చి 3 వికెట్లు, ప్రణవ్ రెడ్డి 2 వికెట్లు, రాజేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్ర జట్టు నిర్ణీత 17 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 42 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 21 పరుగులు, హానీష్ వీరారెడ్డి 13 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కూచ్‌బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ ప్రారంభం
కూచ్‌బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ ప్రారంభం


