
చేనేత నగర్‌లో చోరీ
కురబలకోట : మండలంలో చేనేత నగర్‌లోని ఎస్.బాషా ఇంటిలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలోని రూ.లక్ష నగదు, బీరువాలో దాచిన రూ.3 లక్షలు విలువ చేసే బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఎస్.బాషా కుటుంబీకులు ఆదివారం రాత్రి బ్రాహ్మణ ఒడ్డుపల్లె కాలనీలోని కూతురి ఇంటికి వెళ్లారు. ఇతని ఇళ్లు చేనేత నగర్ చివరలో ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం పసిగట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి రెండు బీరువాలు పగుల గొట్టి వీటిని చోరీ చేశారు. సోమవారం ఉదయం బాషా కుటంబీకులు ఇంటికి వచ్చి చూసి నిశ్చేష్టులయ్యారు. ఇంటి పని ప్రారంభించడానికి బాధితుడు దాచిన రూ.లక్ష సొమ్ము దొంగల పాలు కావడంతో అతని ఇంటి కలలు ఆవిరయ్యాయి. సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
నందలూరు : రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 21వ తేదీన జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఎం.యేసుప్రియ, ఎస్.మన్సూర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్‌రాజు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ సుస్మిత, పీఈటీ జగన్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాజంపేట జిల్లా హామీని సీఎం నెరవేర్చాలి
రాజంపేట : రాజంపేట జిల్లా ప్రకటనపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెరవేర్చాలని జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య అతిఽథి గృహంలో నేతలు భేటీ అయ్యారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాజంపేటలో ఇచ్చిన హామీ మేరకు రాజంపేటను జిల్లా చేయాలనే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు పూల భాస్కర్, ఉద్దండం సుబ్రమణ్యం, గీతాంజలి రమణ, నందగోపాల్, జువ్వాజి మోహన్, సుదర్శన్, షేక్ అస్లాం, విద్యార్థి సంఘం నేత నాగేశ్వరనాయుడు, రమణనాయుడు, రఘుపతినాయుడు, పోకల ప్రభాకర్, మహదేవయ్య, డీఎస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
భర్త, బంధువులు వేధిస్తున్నారని ఫిర్యాదు
కడప అర్బన్ : కడప నగరంలోని మరియాపురానికి చెందిన వసంతకు, కలికిరికి చెందిన ప్రవీణ్‌కుమార్‌కు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వసంత, తన భర్తతోపాటు, అత్త, బంధువులు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా సీఐ టి.రెడ్డెప్ప తెలిపారు.

చేనేత నగర్‌లో చోరీ

చేనేత నగర్‌లో చోరీ