
మోటారు షెడ్డు కూల్చివేత
సిద్దవటం : సిద్దవటం గ్రామ శివారులోని స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం రాత్రి లారీ కల్వర్టులో పడిన ప్రమాదంలో నందలూరుకు చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాసులకు గాయాలయ్యాయి. లారీ కోడూరు నుంచి మామిడి కట్టెలు లోడు చేసుకొని ఆదివారం రాత్రి గోపవరంలోని సెంచురియన్ ప్లే ఉడ్ ఫ్యాక్టరీకి బయలుదేరింది. స్విమ్మింగ్ పూల్ వద్ద ఎత్తుగా ఉండటంతో అక్కడ డ్రైవర్ గేర్ మార్చుకోలేకపోవడంతో వెనక్కు వచ్చి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శ్రీనివాసులకు గాయాలు కాగా స్థానికులు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.