మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Aug 26 2025 7:40 AM | Updated on Aug 26 2025 7:40 AM

మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు

మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు

రాయచోటి : జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మాదక ద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణ, రవాణాను అరికట్టేందుకు ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 530 ఉన్నత పాఠశాలల్లో 430 ఈగల్‌ క్లబ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. మందుల షాపులలో డాక్టర్‌ రాసిన చీటీలు లేకుండా మందులు ఇవ్వరాదని, తరచూ మందుల షాపులను తనిఖీ చేయాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో పోలీసు శాఖ వారికి ఇప్పటికే 735 అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. గంజాయి డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ముందడుగు, డ్రగ్స్‌ గంజాయి బానిసత్వం నుండి బయటకు రండి తదితర పోస్టర్లను జేసీ ఆవిష్కరించారు. సమావేశంలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ మధుసూదన్‌ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఏఈఎస్‌ జోగేంద్ర, డీఎస్పీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement