
బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు
నిమ్మనపల్లె : బైక్ అదుపు తప్పి యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. వెంగంవారిపల్లె పంచాయతీ కొత్తకొండసానివారిపల్లెకు చెందిన బాలకృష్ణ కుమారుడు నవీన్(25) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో నిమ్మనపల్లెకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలోని చిన్నల్లవారిపల్లె వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి వెళ్లగా గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు.
ఆటో బోల్తా పడి ..
మదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం పుంగనూరు మండలంలో జరిగింది. నేతిగుట్లపల్లెకు చెందిన మహేశ్వర(40) మరి కొందరితో కలిసి ఆటోలో పుంగనూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలోని రాంపల్లి వద్ద ఒక్కసారిగా కుక్కలు అడ్డురావడంతో ఆటో ఆదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో మహేశ్వరతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. కొందరు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా తీవ్రంగా గాయపడిన మహేశ్వరను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.