
రాజ్యసభ సభ్యుడు మేడాపై దుష్ప్రచారం శోచనీయం
రాజంపేట : రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిపై ఎల్లోమీడియా, కూటమి ప్రభుత్వ అనుకూల ఛానళ్లు దుష్ప్రచారం చేయడం శోచనీయమని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి అన్నారు. సోమవారం తన స్వగృహంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే మేడా కుటుంబానికి ఎంతో అభిమానం ఉందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు, రాజకీయాలలో మేడా రఘునాథరెడ్డి కుటుంబం జగన్‌రెడ్డిని వీడి వెళ్లరని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని భావించే వ్యక్తి మేడా రఘునాథరెడ్డి అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విధంగా పాలన సాగించాలే కానీ తమకు అనుకూలమైన మీడియా ద్వారా మేడాపై బురదచల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు.