
ఆగి ఉన్న లారీని ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆగి ఉన్న లారీని ఢీకొన్న విద్యార్థికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్న ఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు గౌతమ్(18) మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. శనివారం కళాశాల ముగించుకుని ఆలస్యంగా ద్విచక్రవాహనంలో రాత్రి ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యంలోని గ్రీన్‌వ్యాలీ స్కూల్ సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్లి ఢీకొన్నాడు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు.