
విద్యాసాగర్ ఆస్పత్రిలో 500 రొబొటిక్ శస్త్ర చికిత్సలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : బోన్, జాయింట్ కేర్‌లో అద్భుతమైన ప్రయాణంలో మరొక పెద్ద మైలురాయిని విద్యాసాగర్ ఆసుపత్రి అధిగమించిందని, తమ ఆస్పత్రిలో 500 రోబోటిక్ మోకాళ్ల శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందని ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. ఆస్పత్రిలో ఆదివారం ఆయన కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నొప్పి నుంచి నూతన జీవితం వరకు ప్రయాణించిన అనేక మంది రోగుల చిరునవ్వులు చూడడం ఆత్మ సంతృప్తిని ఇస్తోందన్నారు. తమ ఆస్పత్రిలో గత 15 ఏళ్లుగా ఎముకలు, కీళ్ల సంరక్షణలో విశేష సేవలందిస్తూ 7500 లకు పైగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ విజయం అధునాతన జాయింట్ రీప్లేస్‌మెంట్ సాంకేతికతలో ఒక ముందడుగు అన్నారు. రాయలసీమలో జాయింట్ కేర్ కోసం ప్రపంచ స్థాయి సీఓఆర్‌ఐ రోబోటిక్ సాంకేతికతను పరిచయం చేసిన మొదటి ఆసుపత్రిగా విద్యాసాగర్ హాస్పిటల్ , పాక్షిక, సంపూర్ణ మోకాళ్ల మార్పిడి శస్త్రచిత్సలతోపాటు హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. 500 రోబోటిక్ మోకాళ్ల శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకోవడం తమ బృందం అంకితభావానికి, ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, రిటైర్డ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నాగముని రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ కె.చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య అధ్యక్షుడు డాక్టర్ ఆర్.రంగనాథ రెడ్డి, సైకాలజిస్ట్ ఓవీ రెడ్డి,, కడప నగరంలోని ప్రముఖ డాక్టర్లు, పెన్షనర్లు పాల్గొన్నారు.