
ఈడబ్ల్యుఎస్ విధానాన్ని ఎత్తివేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలని జేఏసీ చైర్మన్ ఎం.రంగనాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటి పట్టణలలోని ఎన్‌జీఓ హోంలో ఏపీ బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చట్టసభలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. పెన్షనర్ల హక్కులను హరించే ఆర్థిక బిల్లు 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోహిణి కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చింతం నాగరాజు, బీసీఎఫ్ జనరల్ సెక్రటరీ కుమార్‌యాదవ్, డి.శంకర్, బీసీఈ చంద్ర, జిల్లా బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యక్షురాలు దివిటి పద్మయాదవ్, మహిళా సెక్రటరీ కందుకూరి సుమితాగౌడ్, జనరల్ సెక్రటరీ కందుకూరి రామయ్య, జాయింట్ సెక్రటరీ ఎల్.గంగాధర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గంగాధర్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.