
విద్యార్థుల మృతిపై ఎంపీ మేడా తీవ్ర విచారం
● మృతుల కుటుంబాలకు
రూ. 50 వేల సాయం
● ఎంపీ మేడా రఘునాథ రెడ్డి
రాజంపేట (ఒంటిమిట్ట) : రాజంపేట మండల పరిధిలోని బాలరాజుపల్లి చెయ్యేరు నదిలో ఎనిమిది మంది విద్యార్థులు ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు ఇసుక ఊబిలో చిక్కుకొని మృతి చెందిన ఘటనపై రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు వారు తమ ప్రగాడ సానుభూతి తెలిపి మృతులకు సంబంధించిన బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున తమవంతు సహాయంగా ప్రకటించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు చెరువులలో నీటి ప్రవాహం ఉధృక్తంగా ఉందని, ఈతకు వెళ్లే యువకులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు, విద్యార్థులు సరదాగా, ఆకతాయితనంగా ఈతకు వెళ్లి ఇలా మృతి చెందితే తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలిస్తాయన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే రాజంపేట నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసి ఈత నేర్చుకోవాలన్న వారికి అందుబాటులో ఉంచుతామన్నారు.