మదనపల్లెలో ఏసీబీ సోదాలు | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో ఏసీబీ సోదాలు

Aug 23 2025 2:37 AM | Updated on Aug 24 2025 8:50 AM

బాల్య

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

మదనపల్లె రూరల్‌ : పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఆఫీసులో ఏఓగా పనిచేస్తున్న మూడే బాలునాయక్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో...శుక్రవారం ఉదయం మదనపల్లె పట్టణంలోని కురవంక రవీంద్రనగర్‌లోని బాలూనాయక్‌ కుమారుడు శ్రీకాంత్‌ ఇంట్లో ఏసీబీ తిరుపతి సీఐ నరసింహారావు, రామారావుకాలనీలోని వియ్యంకుడు వాలేనాయక్‌ ఇంట్లో ఏసీబీ సీఐ హమీద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. పత్రాలను పరిశీలించారు. అయితే సోదాలకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించలేదు.

ఇంటి దారి విషయమై వ్యక్తిపై దాడి

మదనపల్లె రూరల్‌ : ఇంటి దారి విషయమై కొందరు కలిసి వ్యక్తిపై దాడిచేసిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. కొత్తవారిపల్లె పంచాయతీ ఓబిరెడ్డిగారిపల్లెకు చెందిన చలపతిరెడ్డి కుమారుడు లోకేష్‌రెడ్డి(42)కు తన ఇంటికి దారి విషయమై స్థానికులైన రామకృష్ణారెడ్డి, సోమనాథరెడ్డితో వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈ విషయమై రామకృష్ణారెడ్డి తన అనుచరులు రెడ్డిగానిపల్లెకు చెందిన మునిరాజ, ఓబిరెడ్డిగారిపల్లెకు చెందిన సోమనాథరెడ్డి, రెడ్డెప్పరెడ్డితో కలిసి లోకేష్‌రెడ్డిపై దాడికి పాల్పడి కర్రలతో తీవ్రంగా కొట్టారు. కత్తితో చంపేస్తామని బెదిరించారు. దాడిలో లోకేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు బాధితులు తెలిపారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు 1
1/1

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement