
కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన హోంగార్డులకు అభినందనలు
రాయచోటి : హోంగార్డ్స్‌గా పనిచేస్తూనే కానిస్టేబుల్‌గా ఎంపికై న వారిని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు అభినందించారు. అన్నమయ్య జిల్లా పోలీసు విభాగంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ ఇటీవల ఏపీ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పరీక్షలలో ఎంపికై న ఐదుగురికి ఎస్పీ పుష్పగుచ్చాలు, శాలువాలు, సర్టిఫికెట్లతో ప్రత్యేకంగా సన్మానించారు. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ద్వారా విజయాన్ని సాధించగలిగారని కితాబిచ్చారు. హోంగార్డ్స్ నుండి కానిస్టేబుల్ స్థాయి సాధించడం తమ తోటివారికి స్ఫూర్తిదాయకమన్నారు. మీరు చూపిన ఆత్మవిశ్వాసం, పట్టుదల యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఉద్యోగంలోకి వచ్చిన తరువాత కూడా అదే ఆదర్శాన్ని కొనసాగిస్తూ నియమ నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలన్నారు. అలాగే పోలీస్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా కీలకం కావడంతో అందులో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. జి సంజీవ్, సి గంగాధర్, బి విజయ్ కుమార్ నాయకు, టిఎం ఖాజాఫీర్, ఎం నరసింహులు కానిస్టేబుల్ ఉద్యోగాలను పొందిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, ఏఆర్ డీఎస్పీ ఎం శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎం పెద్దయ్యలు పాల్గొన్నారు.