
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
రాయచోటి : మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించేలా చర్యలు చేపట్టాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్‌రావు ఆదేశించారు. శుక్రవారం రాయచోటిలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసానుకూల అవగాహనపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె.సంతోష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సుకు జిల్లాలోని రాయచోటి, రాజంపేట, పీలేరు, మదనపల్లి డివిజన్లలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. వినియోగదారులు సంస్థకు దేవుళ్లతో సమానమని కె.సంతోష్‌రావు అన్నారు. వారికి మెరుగైన సేవలందించే క్రమంలో విద్యుత్ సరఫరాను అంతరాయం లేకుండా, లోవోల్టేజీ సమస్య రాకుండా చూడాలన్నారు. ఉద్యోగులు కార్మికులు వారి పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అలా లేని వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులతో సత్సంబంధాలను కొనసాగించాలని తెలిపారు. అర్బన్, మండల హెడ్ క్వార్టలలో లో వోల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలలో అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చాలన్నారు. సదస్సులో చీఫ్ జనరల్ మేనేజర్ జానకిరామ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై మండల అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పి.యుగంధర్, ఈశ్వర్‌రెడ్డి, వై.చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గంగాధర్, డిప్యూటీ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు సదస్సులో పాల్గొన్నారు.
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఛైర్మన్
అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్‌రావు