సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం | - | Sakshi
Sakshi News home page

సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం

Aug 22 2025 3:24 AM | Updated on Aug 22 2025 3:24 AM

సార్వ

సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం

సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం ● టెన్త్‌కు 35...ఇంటర్‌కు 31 కేంద్రాలు అర్హతలు..

ఎస్‌ఎస్‌సి కోర్సులో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 14 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి ఉండదు. చదవడం, రాయడం తెలిసి ఉండాలి. దర ఖాస్తుతో పాటు టీసీ,రికార్డు షీటు, పుట్టినతేదీ ద్రువీకరణ పత్రం, ఇంటర్‌కు 10వ తరగతి మార్కుల జాబితా, ఎస్‌ఎస్‌సి టీసీని దరఖాస్తుతో పాటు అందజేయాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.

మదనపల్లె సిటీ: మధ్యలో చదువు మానేసిన, ఉత్తీర్ణులు కాలేపోయినా వారి విద్యాసక్తిని నెరవేర్చేందుకు సార్వత్రిక విద్య విధానం (ఓపెన్‌ స్కూల్‌) ఉపయోగకరంగా ఉంటోంది. ఈ విధానంలో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు. 14 ఏళ్ల నుంచి బడి మధ్య మానేసిన వారు సార్వత్రిక పాఠశాలలో చేరి 10వ తరగతి చదువుకునేందుకు అవకాశం ఉంది. అంతేగాక 15 ఏళ్లు నిండి పదో తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్‌లో చేరి చదువుకునే వెసులుబాటుంది. ఇది వరకు ఇంటర్మీడియట్‌ చదివి అనుత్తీర్ణులై, మధ్యలో మానేసిన వారు కూడా ఈ విధానంలో పూర్తి చేయవచ్చు. మహిళలు, వివిధ వృత్తులు, వ్యాపార రంగంలో ఉన్న వారికి, ఉద్యోగులకు, వివిధ సంఘాల సభ్యులు,సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి చదువుకునేందుకు ఓపెన్‌ స్కూల్‌ చక్కని మార్గం. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులయ్యాక డిగ్రీ, పీజీ తదితర కోర్సులతో పాటు పోటీ పరీక్షల్లో తమ ప్రతిభ చాటుకునే వీలుంది.

● పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ( ఏపీ ఓపెన్‌ స్కూల్‌) ద్వారా ప్రభుత్వం సువార్ణవకాశం కల్పిస్తోంది. ఈ సర్టిఫికెట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉంది. వీరు ఎలాంటి ఉద్యోగానికై నా అర్హులే. చదువుపై ఆసక్తి ఉన్న పలువురు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పది, ఇంటర్‌ పూర్తి చేసి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అభ్యాసకులకు విద్యను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం ఓపెన్‌ స్కూల్‌ తరగతులు నిర్వహిస్తోంది.

ప్రవేశాలు ఇలా:

జులై నెల నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.200 అపరాధ రుసుంతో సెప్టెంబర్‌ 15 వతేదీ వరకు అడ్మిషన్‌ పొందవచ్చు.

కనీసం 24 కాంట్రాక్టు తరగతులు

ఓపెన్‌ స్కూల్‌లో పది, ఇంటర్‌ అడ్మిషన్‌ పొందిన వారికి ప్రతి ఆదివారం, నెలలో రెండో శనివారం అధ్యయన కేంద్రాల్లో 30 కాంట్రాక్టు తరగతులు నిర్వహిస్తారు. కనీసం 24 కాంటాక్టు తరగతులకు హాజరైన వారిని మాత్రమే అనుమతిస్తారు. సార్వత్రిక పాఠశాలలో చేరే వారికి స్టడీ మెటీరియల్‌ సరఫరా చేస్తారు.

ఐదేళ్లలో పూర్తి చేయాలి:

అభ్యాసకులు నిర్ణీత ఐదేళ్లలో తొమ్మిది సార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్‌ పరీక్షలు రాసేవారు మాత్రం 10 పాసై రెండేళ్ల వ్యవధి ఉంటే ఐదు సబ్జెక్టులు ఒకేసారి రాసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల వ్యవధి లేకపోతే నాలుగు సబ్జెక్టులు రాసి, రెండేళ్లు పూర్తయిన తర్వాత మిగిలిన ఒక సబ్జెక్టును రాసుకోవచ్చు. అడ్మిషన్‌ పొందిన అనంతరం ఐదేళ్లలో తొమ్మిది సార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందకపోతే తిరిగిర కొత్తగా అడ్మిషన్‌ పొందాల్సి ఉంటుంది.

సర్టిఫికెట్లకు గుర్తింపు ఉంది

సార్వత్రిక పాఠశాలలో చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు అందించే సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు ఎంసెట్‌, డైట్‌సెట్‌ వంటి పరీక్షలతో పాటు ఇంటర్‌ అర్హతతో పొందే అన్ని ఉద్యోగాలకు అర్హులే.

ఓపెన్‌ స్కూల్‌లో టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలు

దరఖాస్తుకు గడువుపెంపు

జిల్లాలో టెన్త్‌కు 35, ఇంటర్‌కు 31 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. పదో తరగతిలో 100 మందికి, ఇంటర్‌లో నాన్‌ సైన్స్‌లో 40, సైన్స్‌లో100 మందికి అవకాశం ఉన్నాయి. అడ్మిషన్‌ పొందిన వెంటనే స్టడీ మెటీరియల్‌ అందిస్తారు. ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో ఆయా అధ్యయన కేంద్రాల్లో కాంట్రాక్టు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతితో పాటు ఇంటర్‌లో ఆర్ట్స్‌ గ్రూపులైన హెచ్‌ఈసీ, సీఈసీ, సైన్స్‌ గ్రూపులైన ఎంపీపీ, బైపీపీ, ఎంబైపీసీ, ఎంఈసీలో ప్రవేశాలు పొందవచ్చు. ఈ సర్టిఫికెట్లు ఉన్నత చదువులకు , ఉద్యోగాలకు, పదోన్నతులకు ఉపయోగపడుతున్నాయి. అభ్యర్థులు పదో తరగతి మార్కుల జాబితా లేదా జనన ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్‌కార్డు, కులఽధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్‌, ఫోటో, సంతకంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం 1
1/2

సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం

సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం 2
2/2

సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement