
ఆటో ఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆటో ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. బి.కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు జయంత్‌కుమార్ (27) వ్యవసాయకూలి పనుల నిమిత్తం సీటీఎంకు వచ్చాడు. పనులు ముగించుకుని సాయంత్రం కూలీలతో పాటు ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా సీటీఎం అంగళ్లు సమీపంలోని పెట్రోల్ బంకు సమీపంలో మరో ఆటో వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కుడి కాలు, చేయి విరిగాయి. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాఽధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.