
మామిడిలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి
లక్కిరెడ్డిపల్లి : మామిడిలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించడంతో మంచి ఫలితాలు సాధించవచ్చని ఉద్యానశాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మానస పేర్కొన్నారు. బుధవారం మండలంలోని దప్పేపల్లి, కోనంపేట, మద్దిరేవుల గ్రామాలలోని మామిడి రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన మొక్కలతోపాటు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతు పొలంలో ఆర్కబోరల్ కంట్రోల్ అనే మందు కాండం తొలిచే పురుగు నివారణకు వాడే విధానం గురించి వివరించారు. అనంతరం ఉద్యానశాఖ అధికారి సింధూరి మాట్లాడుతూ రైతులు సమగ్రమైన యాజమాన్య పద్ధతులు వాడటం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కేశవయ్య, చంద్రమ్మ, ఉద్యాన సిబ్బంది, మామిడి రైతులు తదితరులు పాల్గొన్నారు.