
రేపు మెగా జాబ్‌మేళా
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.పురుషోత్తం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ జాబ్‌మేళా జరుగుతుందని ఆయన పేర్కొన్నా రు. పదో తరగతి నుంచి డిగ్రీ పాస్ లేక ఫెయిల్ అయిన వారు, సాంకేతిక విద్య అభ్యసించిన వారు అర్హులన్నారు. http://naipunyam.ap. gov.in user registration లింకు ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని వివరించారు.
రాయచోటి టౌన్: జిల్లా వ్యాప్తంగా అనర్హత ఉన్నట్లు ప్రభుత్వం నుంచి నోటీసు అందుకున్న వారు.. అర్హత ఉన్నట్లుగా మీరు భావిస్తే అందుకు సంబంధించిన అర్హత పత్రాలతో అప్పీల్ అర్జీ చేసుకోవాలని వైద్యశాఖ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవోకు గానీ, మున్సిపల్ కమిషనర్‌కు గానీ అర్జీ రాసుకోవాలని వారు పేర్కొన్నారు. పాత, కొత్త సదరం సర్టిఫికెట్లు, ఎక్కడైనా చికిత్స పొందినట్లు రికార్డులు ఉన్నా సమర్పించాలన్నారు. వీటిని వారి కంప్యూటర్‌లో పొందుపరచి తిరిగి నోటీసులు పంపుతారని తెలిపారు. వారు కేటాయించిన రోజున వైద్యుల దగ్గర పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. హాజరు అయ్యే విషయం, తేదీలు నోటీస్ ద్వారా తెలియజేస్తారని వివరించారు.
రాయచోటి జగదాంబసెంటర్: రాయచోటి పట్టణం పాతరాయచోటిలో నివసిస్తున్న మున్సిపల్ ఉద్యోగి మల్లికార్జున ఇంట్లో బ్రహ్మకమలం వికసించింది. శీతల ప్రాంతాల్లో కనిపించే అరుదైన ఈ పుష్పం వికసించడంతో పలువురు వీక్షించేందుకు వస్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన పుష్పంగా పురాణాలు చెబుతున్నాయని, ఏడాదిలో ఒక సారి మాత్రమే అది కూడా రాత్రి వేళలోనే ఈ పువ్వు పూస్తుందని మల్లికార్జున తెలియజేశారు. రాత్రివేళలో శ్వేతవర్ణంలో పెద్దగా వికసించే ఈ పూలు ఉదయానికి మొగ్గలా ముడుచుకుంటాయన్నారు. ఈ పుష్పాన్ని దేవుని పూజకు వినియోగిస్తామని ఆయన తెలియజేశారు.
రాయచోటి: నూతన బార్ పాలసీలో భాగంగా జిల్లాలోని బార్లను ఈ నెల 28న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.జయరాజ్ తెలిపారు. మంగళవారం అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్ పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్ అధ్యక్షతన జిల్లా పరిధిలోని ఎకై ్సజ్ సీఐలు, లైసెన్సీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి–5, రాజంపేట–2, రాయచోటి–3, పీలేరు–1 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తులను 28న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా లాటరీ పద్ధతిలో తీసి, బార్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: సమాచారం హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని జిల్లా సహకార శాఖ అధికారి గురుప్రకాశ్ తెలిపారు. రాజంపేటలో డీసీఓ ఆధ్వర్యంలో మంగళవారం సమాచారహక్కు చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 నుంచి సమాచారం హక్కు చట్ట కొనసాగుతోందన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో సరైన అవగాహన లేకుండా పోతోందన్నారు. పౌరులు తమ హక్కులను వినియోగించుకోలేక పోతున్నారన్నారు. అందువల్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు. ఆర్జీదారికి సరైన సమాచారం ఇవ్వడం ప్రభుత్వ సిబ్బంది బాధ్యత అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ గోపికృష్ణ, కేజీవీ నాయుడు, ఎస్‌ఐ ఎస్వీ రమణ, డీసీసీబీ మేనేజరు రాజేష్, పీఏసీఎస్ సీఈవోలు, డీసీసీబీ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రేపు మెగా జాబ్‌మేళా