
సమయం కావాలంటున్నారు
టమాటా మండీల్లో చిన్న టమాటా క్రీట్లు ఏర్పాటు చేయడానికి వ్యాపారులు కొంత సమయం కావాలంటున్నారు. రెండునెలల క్రితం మార్కెట్‌కమిటీపాలక వర్గ సమావేశంలో ఈవిషయమై తీర్మానం చేశారు. ఆప్ప డు వ్యాపారులు అంగీకరించి ఇప్పుడు సమ యం కావాలంటున్నారు. పదిశాతం కమీషన్, జాక్‌పాట్ విధానం ఇంకా కొనసాగిస్తున్నారు.దీనిపై చర్యలు తీసుకొంటాం. – కుమార్‌రెడ్డి,
మార్కెట్‌కమిటీకార్యదర్శి, వాల్మీకిపురం
రైతులకు సమాధానం చెప్పాలి
పాలకవర్గం తీసుకొన్న నిర్ణయాలు అమలు చేయాలి. లేని పక్షంలో పాలకవర్గంతో పాటు అధికారులు,వ్యాపారులు రైతులకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ నిబంధనలు మండీల్లో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వ్యాపారులు కూడా నిబంధనలకు లోబడే వ్యాపారాలు నిర్వహించాలి. –తరిగొండ నౌషాద్‌ఆలీ,
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, వాల్మీకీఫురం

సమయం కావాలంటున్నారు