
● బోర్డులకే పరిమితమైన 4 శాతం కమిషన్
ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగుశాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాలి. ప్రతి మండీ వద్ద ఇప్పటికీ 4శాతం మాత్రమే కమీషన్ అనే బోర్డులు ఉన్నాయి. అయితే పేరుకే బోర్డులు వేశారు తప్ప నిబంధనలు అమలు కావడలేదు. పదిశాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. మార్కెట్‌యార్డుకు టమాటాలను తీసుకొచ్చే రైతుల దగ్గర 10శాతం కమీషన్‌తో పాటు క్రీట్ కూలీ రూ.2, క్రీట్ బాడుగ రూ.2 వసూలు చేస్తున్నారు. దీంతో ఒక క్రీట్ మార్కెట్‌యార్డుకు చేరేసరికి కోతకూలీ, రవాణా ఖర్చులు, మండీల ఖర్చులు కలుపుకొంటే రు. 24 నుంచి రూ. 30 వరకు ఖర్చు వస్తోంది.