
అదృశ్యమైన మహిళ దారుణ హత్య
చిన్నమండెం : మదనపల్లె మండలంలో అదృశ్యమైన ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటన వెలుగు చేసింది. వివరాలు ఇలా.. ఈ నెల 10వ తేదీన మదనపల్లె మండలం పొన్నేటిపాలెం పంచాయతీ సవరంవారిపల్లెకు చెందిన శ్రీదేవి(45) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆమె బావ వాసు మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఆమె అదృశ్యం కేసును ఛేదించినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. శ్రీదేవికి ఆమె అక్క అల్లుడైన శివకుమార్ నాయుడుతో వివాహేతర సంబంధం ఉండేదన్నారు. ఈ క్రమంలో శివకుమార్ నాయుడు తన మోటార్ సైకిల్‌లో శ్రీదేవిని ఎక్కించుకుని చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఆమె చీరతో గొంతుకు ఉరివేసి చంపివేశాడన్నారు. అక్కడే పెట్రోల్ పోసి కాల్చివేశాడన్నారు. శ్రీదేవి కాల్‌డేటా ఆధారంగా శివకుమార్‌నాయుడును అదుపులోకి తీసుకోగా ఈ విషయాలు తెలిశాయన్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.
ఐదుగురు బైక్ దొంగల అరెస్టు
జమ్మలమడుగు : బైకుల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు యువకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 10వతేదీన ప్రొద్దుటూరు రఽహదారిలో హోండా యాక్టివా చోరీకి గురైందంటూ బాధితుడు కొక్కొకోల రామమోహన్ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా సోమవారం తమకు దొంగల సమాచారం అందిందన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులోని ఎస్‌ఆర్ పెట్రోల్‌బంకు వద్ద సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు యువకులు తమ సిబ్బందిని చూసి వాహనాలు వెనక్కి తిప్పుకుని వెళుతుండటంతో సిబ్బంది పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా బైకుల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి పది లక్షల రూపాయల విలువ గల 9 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ లింగప్ప, ఎస్‌ఐ హైమావతి, దేవదాసు, రియాజ్, నాగేంద్ర, శివ పాల్గొన్నారు.
మిస్టరీని ఛేదించిన పోలీసులు