
పూర్వ విద్యార్థుల కలయిక
తంబళ్లపల్లె : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థులు 50 ఏళ్ల తరువాత కలుసుకోవడం విశేషం. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. నాటి విద్యార్థులు సుమారు 34 మంది హాజరయ్యారు. అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ గత స్మృతులు నెమరువేసుకున్నారు. నాటి గురువులను స్మరించుకున్నారు. మృతి చెందిన గురువులు, సహచర విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం వహించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డు జిల్లా జడ్జి క్రిష్ణప్ప, ఆడిటర్ చంద్ర, మల్లికార్జున గ్రూపు థియేటర్ యజమాని కుళాయిరెడ్డి, మెడికల్‌షాపు సుధాకర్, మానవత సంస్థ నారాయణరెడ్డి, శంకర్, నలంద రామచంద్రారెడ్డి, క్రిష్ణారెడ్డి, పీజె వెంకటరమణారెడ్డి, పోస్టు రామచంద్రారెడ్డి, దీనదయాల్, గంగుల్‌రెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.