
కోళ్లబైలులో ఆక్రమణల తొలగింపు
మదనపల్లె రూరల్ : కోళ్లబైలులో కబ్జాల జోరు శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. కోళ్లబైలు పంచాయతీ శేషాచలనగర్‌లో అక్రమంగా వేసిన పునాదులు, నిర్మాణాలను కూల్చివేశారు. స్థానికంగా ఇంటి నిర్మాణాలు జరుపుతున్న వారిని తమ పట్టాలు తీసుకుని ఆదివారం తహసీల్దార్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. దీంతో సుమారు 15మందికి పైగా తమ పట్టాలను తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. 2008లో చేనేత కార్మికులమైన తమకు రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారని, అయితే..అధికారులు కేటాయించిన స్థలం కొండలు, గుట్టలు కావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయామన్నారు. ప్రస్తుతం నిర్మాణాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి లబ్దిదారుల నుంచి పట్టాలు, ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్‌లు తీసుకున్నారు. రెవెన్యూ సిబ్బందితో పట్టాలు, లబ్దిదారుల అర్హతను పరిశీలిస్తామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులై ఉంటే, తదుపరి నిర్ణయం తెలుపుతామన్నారు. అప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని వారికి సూచించారు.
ఇంటి పట్టాలపై తహసీల్దార్ విచారణ

కోళ్లబైలులో ఆక్రమణల తొలగింపు