
అద్దె ఇల్లే గతి
కురబలకోట మండలం చేనేత నగర్‌కు చెందిన కుమారి చేనేత కార్మికురాలు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు పక్కా గృహం మంజూ రు కాకపోవడంతో ఇంటికోసం దర ఖాస్తు చేసుకుంది. సొంతిల్లు లేని కారణంగా అద్దె ఇంట్లో ఉంటున్న కారణంగా అద్దె భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభు త్వం పక్కా గృహం మంజూరు చేస్తే సొంతింటి కలను సాకారం చేసుకుంటానని చెబుతోంది కుమారి. ప్రభు త్వం ఇలాంటి పేదల సొంతింటి కలను ఎప్పుడు సాకారం చేస్తుందో.
● ఇళ్ల నిర్మాణాలకు రూ.4 లక్షలుఇస్తామని చంద్రబాబు హమీ
● అధికారంలోకి వచ్చి ఏడాది దాటినాపేదలకు ఎదురుచూపులే..
● ఇప్పటికే మంజూరు కోసం45,079 దరఖాస్తులు పెండింగ్