దివ్యాంగ పింఛనుదారుల కడుపు కొట్టారు ! | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ పింఛనుదారుల కడుపు కొట్టారు !

Aug 17 2025 6:33 AM | Updated on Aug 17 2025 6:33 AM

దివ్యాంగ పింఛనుదారుల కడుపు కొట్టారు !

దివ్యాంగ పింఛనుదారుల కడుపు కొట్టారు !

దివ్యాంగులకు ద్రోహం చేస్తారా..

కురబలకోట : అనర్హత పేరుతో కూటమి ప్రభుత్వం దివ్యాంగ పింఛనుదారుల కడుపుకొట్టింది. అనర్హత వేటు పడటంతో కళ్లలో కన్నీళ్లు.. చేతుల్లో వణుకుతో దివ్యాంగులు అల్లాడిపోతున్నారు. ఇన్నాళ్లు పింఛన్‌ వస్తుందన్న ధైర్యంతో బతుకు వెళ్లదీశాం. ఇక మాకు దిక్కెవరు దేవుడా..అంటూ పింఛన్లు రద్దయిన దివ్యాంగులు నిట్టూరుస్తున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో 20 నుంచి 30 శాతానికి పైగా పింఛన్లు రద్దు చేశారు. రీవెరిఫికేషన్‌ తర్వాత దివ్యాంగ సర్టిఫికెట్లను సచివాలయాల్లో ఆన్‌లైన్‌లో ఉంచారు. వీటిని చూసి పలువురు దివ్యాంగులు షాక్‌కు గురయ్యారు. 90 శాతం వికలత్వం ఉన్న వారికి 85 లోపు వేశారు. దీంతో వీరికి ఇక నుంచి రూ.15 వేలు పింఛన్‌ రాదు. వీరికి సాధారణ దివ్యాంగుల్లా రూ.6 వేలు పింఛన్‌కు మాత్రమే అర్హులు. అదే విధంగా రూ.6 వేలు వచ్చే పింఛన్‌దారులకు కూడా కోత కోశారు. వికలత్వం 40 శాతం కంటే తక్కువగా ఉందని అనర్హత వేటు వేశారు. విషయం తెలుసుకున్న దివ్యాంగులు షాక్‌కు గురవుతున్నారు. కుమిలిపోతూ కంటతడి పెడుతున్నారు. వీరికి నోటీసులు జారీ చేస్తున్నారు. అనర్హత వేటుకు గురైన వారు మళ్లీ అప్పీల్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు. మండలంలో 1045 దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. ప్రతి సచివాలయ పరిధిలో పింఛన్లలో అనర్హతకు గురైనవారున్నారు. రీ వెరిఫికేషన్‌కు మళ్లీ సచివాలయ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటిలో వాళ్లు చూసినా చూడకున్నా పింఛన్‌ సొమ్ముతో కాలం వెల్లదీసేవారు. అలాంటిది వికలత్వ శాతం తక్కువగా ఉందని అనర్హత వేటు వేయడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. ఉన్న ప్రాణానికి ఉపద్రవంలా కూటమి ప్రభుత్వ తీరు మారిందని పలువురు విమర్శిస్తున్నారు.

రీ వెరిఫికేషన్‌ ముసుగులో అనర్హత వేటు

రూ.15వేలు

పింఛన్‌

కోల్పో

యానని వేదన

పడుతున్న దివ్యాంగుడు బాబా

ఫకృద్దీన్‌

కూటమి ప్రభుత్వం పింఛన్‌ సొమ్మును పెంచినట్లు పెంచి రీ వెరిఫికేషన్‌ పేరుతో అనర్హత వేటు వేయడం విచారకరం. నాకు గతంలో 90 శాతం వికలత్వ సర్టిఫికెట్‌ ఉండేది. నెలకు రూ.15 వేలు పింఛన్‌ వచ్చేది. రీ వెరిఫికేషన్‌లో నాకు 76 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్‌ వచ్చింది. 85 శాతం అంతకు పైగా ఉంటేనే రూ.15 వేలు పింఛన్‌ వస్తుంది. దీంతో నాకు ఇక నుండి రూ.15 వేలు పింఛన్‌ రాదు. నెలకు రూ. 6 వేలు మాత్రమే వస్తుంది. ఇది కూటమి ప్రభుత్వ ద్రోహం..కుట్ర. నాకు రెండు కాళ్లు పనిచేయవు. ఉన్న చోటు నుండి కదలలేను. పైగా ఎంబీఏ చదివిన నిరుద్యోగిని. ఎలాంటి పనులు చేసుకోలేను. కనికరం లేకుండా వికలత్వ శాతం తగ్గించి నా కడుపు కొట్టారు. గతంలో 90 శాతం వికలత్వం ఉన్నట్లు ఇచ్చారు. ఇప్పుడు 76 శాతం ఉన్నట్లు ఇచ్చారు. అప్పటి డాక్టర్‌కు ఇప్పటి డాక్టర్‌కు తేడా ఏమిటో చంద్రబాబు ప్రభుత్వమే చెప్పాలి. చంద్రబాబుకు ఎవ్వరూ దొరకనట్లు దివ్యాంగులతో పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వానికి మాలాంటి వారి ఉసురు తగలకపోదు. – కె. బాబా ఫకృద్దీన్‌,

బాధిత దివ్యాంగుడు, కురబలకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement