
వీళ్లేమైనా పాలెగాళ్లా !
మదనపల్లె : చట్టాన్ని అతిక్రమించి దాడులకు పాల్పడ్డానికి వీళ్లేమైనా వీరులు, శూరులా.. పాలెగాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు వీరెంత అంటూ తంబళ్లపల్లె టీడీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మదనపల్లెలో దాడికి గురై స్థానిక ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన వర్గీయులు సాగర్‌కుమార్, నటరాజ నాయక్‌లను శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు.. దాడి చేసిన వ్యక్తులు ఇది ఫస్ట్ ట్రీట్‌మెంట్ ఇంకా ఉన్నాయని హెచ్చరించారని శంకర్ దృష్టికి తేగా 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటివి ప్రోత్సహించలేదని, ఏదైనా చట్ట పరిధిలో చూసుకోవాలని దాడులు చేయడం ఏం సంస్కృతని ప్రశ్నించారు. బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు బిల్డర్ రమణ, పాలగిరి సిద్దా, నారాయణస్వామిరెడ్డి, ఆనందరెడ్డి, బంగారు వెంకటరమణ, సురేంద్ర యాదవ్, వైజీ రమణ, మైసూర్ శీనా, తెలుగు యువత శ్రీనాథరెడ్డి, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.