● పరువుకోసం పాకులాట | - | Sakshi
Sakshi News home page

● పరువుకోసం పాకులాట

Aug 10 2025 5:47 AM | Updated on Aug 10 2025 5:47 AM

● పరు

● పరువుకోసం పాకులాట

సాక్షి రాయచోటి: వైఎస్సార్‌జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఆదివారంతో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే అభ్యర్థులతోపాటు మద్దతుదారుల ప్రచారంతో పల్లె ప్రాంతాలు హోరెత్తాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాన నాయకులు రంగంలో దిగి జోరుగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు టీడీపీ ప్రచారం చేస్తూనే..ఇంకోవైపు దౌర్జన్యాలు, దాడులతో బెంబేలెత్తించారు. ఏదో ఒక రకంగా వైఎస్సార్‌ సీపీ నాయకులను అడ్డుకోవడంతోపాటు భయపెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌ల విషయంలో పచ్చరాజకీయం తెరమీదికి రావడం, స్థానికంగా ఉన్నవారు మరో బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే కొత్త సంప్రదాయానికి తెరతీయడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సార్వత్రిక ఎన్నికలు కాకపోయినా కేవలం జెడ్పీటీసీ స్థానాల విషయంలోనే కూటమి సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అనైతిక చర్యలకు పాల్పడుతోంది.

● జిల్లాలోని పులివెందులతోపాటు ఒంటిమిట్టలోనూ గెలువడం కష్టమని భావించి నేతలు ప్రలోభానికి తెర తీస్తున్నారు. కొన్నిచోట్ల గుంపగుత్తగా ఓట్లను కొనేందుకు కూడా సిద్ధమవుతున్నారు. భయపెట్టడం, బెదిరించడం, అవసరాన్ని బట్టి ఆర్థికంగా ఆశలు చూపి స్థానిక ప్రజలతోపాటు నాయకులను తమవైపు తిప్పుకోవడం, ఇతర అనేక హామీలతో ఎన్నికల ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు. ఒంటిమిట్టతోపాటు పులివెందులలోనూ ఇప్పటికే ప్రచారంతోపాటు అవసరానికి మించి డబ్బులు ఖర్చు చేసిన కూటమి నేతలు రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ ఎత్తున నగదు పంపిణీకి సిద్ధమవుతున్నారు. ముఖ్య నేతల ఆదేశాలతో కిందిస్థాయిలో ఓటర్లను ఏదో ఒకరకంగా తమవైపు తిప్పుకునేందుకు ఆగచాట్లు పడుతున్నారు. ఒంటిమిట్టలో ఏకంగా మంత్రులు మకాం వేసి పన్నాగం నడిపిస్తుండగా, పులివెందులలోనూ శనివారం మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగించారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ రోజున పోలీసులపై కూడా పెద్ద స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చి టీడీపీ ఆటలు సాగేలా కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేయడంపై ప్రజాస్వామ్యవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడికి అక్కడ ప్రలోభాలకు తెర లేపుతున్న టీడీపీ

అధికారంలో ఉండి ఓడిపోతే పరువు పోతుందన్న ఆందోళనలో కూటమి

జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలు ఎన్నో ఏళ్ల చరిత్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ గెలుచుకుంటూ వస్తోంది. ఈసారి కూడా బలమైన అభ్యర్థులే బరిలో నిలవడంతోపాటు మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో గెలుపుపై పూర్తి ధీమాగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉన్నాయి. ఒంటిమిట్టలోనూ ఇదే పరిస్థితి శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఓడిపోతే ఉన్న పరువు పోతుందని కూటమి శ్రేణు లు ఎంతకై నా తెగించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఒంటిమిట్టతోపాటు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆదివారంతో ప్రచారానికి తెర పడనుంది. జులై 30 నుంచి ఆగస్టు 1వ తేది వరకు నామినేషన్లకు అవకాశం కల్పించగా, పులివెందులలో 11, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటివరకు వైఎస్సార్‌ సీపీ నేతలు అన్ని గ్రామాల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఏది ఏమైనా వైఎస్సార్‌ సీపీ గెలుపుపై ధీమాతో ఉండగా, టీడీపీ నేతలు నిరాశ నిస్పృహాలతో కనిపిస్తుండం గమనార్హం.

● పరువుకోసం పాకులాట 1
1/3

● పరువుకోసం పాకులాట

● పరువుకోసం పాకులాట 2
2/3

● పరువుకోసం పాకులాట

● పరువుకోసం పాకులాట 3
3/3

● పరువుకోసం పాకులాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement