సమస్యలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను సత్వరం బాధ్యతగా పరిష్కరించాలని జల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్‌ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్‌డీసీ రాఘవేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
యోగా నేర్చుకో..ఆయుస్సు పెంచుకో
దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతోపాటు మనిషి ఆయుస్సు కూడా పెరిగేందుకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. యోగాపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 28వ తేదీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అంగన్‌వాడీ హెల్పర్లు, టీచర్లు, ఆశా, హెల్త్ వర్కర్లు తదితరులు ఐదువేల మందితతో మదనపల్లె బీటీ కాలేజీ గ్రౌండ్‌లో ఒకేచోట యోగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరగుతుందన్నారు.


