రాజంపేట కోర్టు క్లాంపెక్స్ ఒప్పందం అమలుకు కృషి
రాజంపేట : రాజంపేట కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన స్థలం అంశంలో రెవెన్యూ, న్యాయశాఖ మధ్య జరిగిన ఒప్పందం అమలుకు తన వంతుగా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికై న రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతు నాయుడు అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కోర్టు క్లాంపెక్స్ ఒప్పందంలో భాగంగా తహసీల్దారు కార్యాలయాన్ని అధికారికంగా న్యాయశాఖకు అప్పగించారని గుర్తు చేశారు. రాజంపేట కోర్టుకు మహర్దశ కల్పించేందుకు అసోసియేషన్ కార్యవర్గ సహకారంతో కృషి చేస్తానన్నారు. కోర్టు నూతన భవనాల నిర్మాణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో తాము ముందుంటామన్నారు. సమావేశంలో న్యాయవాది కేఎంఎల్ నరసింహులు, రాజంపేట, నందలూరు న్యాయవాదులు పాల్గొన్నారు.


