కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
రాములోరి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం బోర్డు సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి 14వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 9న హనుమంత వాహనం, 10న గరుడవాహనం, 11న సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణ జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఏప్రిల్ 12న రథోత్సవం, 14న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. కార్యక్రమంలో ఈఓ జె శ్యామలరావు, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వేసవి నేపథ్యంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలి
రాయచోటి అర్బన్/జగదాంబసెంటర్: వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని కార్మికులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కార్మికశాఖ ఇన్‌చార్జి అధికారి డీవీ రంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మండుతున్న ఎండలను గుర్తెరిగి కార్మికుల రక్షణ కోసం యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కార్మికుల పనిగంటలలో మార్పులు,చేర్పులు చేసుకోవాలన్నారు. బహిరంగంగా పనిచేసే కార్మికులు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు పనివేళలు మార్చుకోవాలన్నారు. పనిప్రాంతంలో చల్లనినీరుతో పాటు నీడవసతిని కూడా కల్పించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురికాకుండా డీహైడ్రేషన్ నివారణ మార్గాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
అర్జీలకు సత్వరమే పరిష్కారం
– జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని నూరుశాతం పరిష్కరించాలన్నారు. సమస్య ఏమిటి, దానిని ఎలా పరిష్కరించాలన్న విషయాలపై అధికారులకు అవగాహన ఉండాలని, చిత్త శుద్ధితో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్‌ఓ మధుసూదన్ రావు, ఎస్‌డీసీ రమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాయచోటి : ప్రజా సమస్యల పరిరరాంలో ఏమాత్రం అలసత్వం చేయరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయడు పోలీసులు అధికారులను ఆదేశించారు. సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు.
మదనపల్లె సిటీ : గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలు, అనాథ బాలికల చదువుకు కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) బాసటగా నిలుస్తున్నాయి. ఉచిత వసతితోపాటు భోజనం ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాయి. తాజాగా కేజీబీవీల్లో 6వ తరగతితోపాటు ఇంటర్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. అర్హులైన బాలికలు 6వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు పొందవచ్చు.
జిల్లా వ్యాప్తంగా చిన్నమండ్యం, చిట్వేలి, గాలివీడు, కలకడ, కురబలకోట, కె.వి.పల్లి, లక్కిరెడ్డిపల్లె, ములకలచెరువు, నిమ్మనపల్లె, ఓబులవారిపల్లె, పెద్దమండ్యం, పెనగలూరు, పెద్దతిప్పసముద్రం, పుల్లంపేట, రామాపురం, రామసముద్రం, రాయచోటి, సంబేపల్లి, తంబళ్లపల్లె, టి.సుండుపల్లి, వీరబల్లి, బి.కొత్తకోటల్లో కేజీబీవీలు ఉన్నాయి. సీట్ల భర్తీలో నిబంధనల మేరకు ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వారీగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం సీట్లను భర్తీ చేస్తారు. 7,8,9 ,10, 12 తరగతుల్లో మిగిలిన సీట్లకుఆడ్మిషన్లు ఉంటాయి. దరఖాస్తును హెచ్‌టీటీపీఎస్://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్ సైట్ ద్వారా పొందవచ్చు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. ఇందు కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు.
తరగతికి 40 మంది...
కేబీజీబీలో 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతికి 40 సీట్ల చొప్పున కేటాయించారు. ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఒక్కో కేజీబీవీలో ఒక్కో గ్రూపును ప్రవేశపెట్టారు. 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు ఉంటాయి.
ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో కేజీబీవీలు : 22
ప్రవేశాలు : 6వ తరగతి
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం :
ఎంపీసీ,బైపీసీ, ఎంఈసీ,సీఈసీ, ఎంఎల్‌టి,
ఎంపీహెచ్‌డబ్యు కోర్సులు 7,8,9,10,12
తరగతుల్లో మిగిలిన సీట్లు
కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన
కేజీబీవీ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోంది. మౌలికసదుపాయాలు, విద్యార్థులకు స్మార్ట్ డిజిటల్ తరగతులు ద్వారా బోధన ఉంటుంది. బాలికలకు భరోసాగా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాలను మెరుగులు దిద్దుతాం.
– సుమతి, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్.కేజీబీవీ, తంబళ్లపల్లె
అవకాశాన్ని వినియోగించుకోవాలి
కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థినులు అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. పేద, అనాథ, బడిబయట పిల్లలు, బడిమానేసిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇక్కడ బోధనతో పాటు వసతి ఉంది.
– సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖాధికారి
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు


