బార్ అసోసియేషన్ ఎన్నికలకు 17 నామినేషన్‌లు
రాయచోటి అర్బన్ : రాయచోటి బార్ అసోసియేషన్‌కు ఈనెల 29న జరుగనున్న ఎన్నికల బరిలో నిలిచేందుకు 17 మంది నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి రాజకుమార్ రాజు, సహాయ ఎన్నికల అధికారి ఇలియాస్‌బేగ్ శనివారం తెలిపారు. బార్ అసోసియేషన్ కార్యవర్గంలోని 7 పోస్టులకుగాను 17 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. నామినేషన్‌ల దాఖలు గడువు ముగిసే సమయానికి అధ్యక్ష పదవికి ఎన్.ప్రభాకరరెడ్డి, వై.రమేష్‌రెడ్డి, ఉపాధ్యక్ష పదవికి టి.ఈశ్వర్, ధనుంజయ కుమార్, ఎంఎల్ రామచంద్రారెడ్డి, వై.రామమోహన్‌రెడ్డి నామినేషన్‌లు దాఖలు చేశారన్నారు. జనరల్ సెక్రటరీగా పి.రెడ్డిబాష, పి.శ్రీనివాసులు, సహాయ కార్యదర్శికి నాగముని, ఎం.వి,.రమణ, రామ్‌కుమార్‌లు, కోశాధి కారిగా ఆదిరెడ్డి నాయక్, నాగరాజులు, లైబ్రరీ సెక్రటరీకి వి.సిద్దయ్య, కె.బాలచంద్రలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ టివి రమణ, డి.రామకుమార్ నామినేషన్‌లు వేసినట్లు తెలిపారు. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన, 25న ఉపసంహరణ, 29న ఎన్నికల నిర్వహణ, అదేరోజున ఎన్నికల ఫలితంపై ప్రకటన ఉంటుందని తెలిపారు.


