15 ఏళ్లు నుంచి ఆటో నడుతున్నాను. ఆటో నడపడం వల్ల ప్రతి రోజూ డీజిల్ ఖర్చు పోను రూ. 300 వరకు మిగిలేవి. వాటితో ఇంటిళ్లిపాది జీవనం సాగించేవారం. ఆటోకు ప్రతి ఏటా ఇన్సూరెన్సు, ఫిట్‌నెస్ తప్పనిసరిగా చేసుకోవలసి వచ్చేది. ఇందు కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పు తీసుకుని చెల్లించేవాడిని. ఆటో సర్వీస్‌తో వచ్చిన డబ్బు వడ్డీలకే సరిపోయేది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. జగనన్న వచ్చాక వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా రూ.10 వేలు ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ తరువాత ఎటువంటి అప్పులు తీసుకోలేదు. ఆటో సర్వీసుతో వచ్చిన సొమ్ముతో చాలా సంతోషంగా జీవిస్తున్నాను.
–చాంద్‌బాషా, సైదాపేట, మదనపల్లె


