వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ‘మావిగన్’ ప్రతిపాదనను ప్రజలు హర్షిస్తున్నారని అర్థం కావడంతో సీఎం చంద్రబాబుకు వణుకు పుడుతోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇవాళ వైఎస్సార్ జిల్లాలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘మావిగన్ ప్రతిపాదనను ప్రజల నుంచి తప్పించడం చేతకాక ఇక పచ్చ మీడియాను రంగంలోకి దించారు. చంద్రబాబుకు శిఖండి మాదిరిగా ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రిక రంగంలోకి దిగింది. రాధాకృష్ణ చేస్తుంది జర్నలిజం కాదు... బ్రోకరిజం. వీకెండ్ కామెంట్స్ పేరుతో రాధాకృష్ణ తీరు అత్యంత దారుణంగా మారింది.
మేము వెన్నెముక లేని మనుషులమని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళల పట్ల నీచంగా, అనుచితంగా మాట్లాడారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అవమానం కాదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు జరిగిన అవమానమే. రాధాకృష్ణ... నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా.. నీలా మేం మాట్లాడితే? కానీ, మేం అంత అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడలేం.
చివరికి భార్యాభర్తల బంధాన్ని కూడా అపహాస్యం చేస్తూ జర్నలిజం అంటావా? ప్రజలు చంద్రబాబు ఎంతటి నీతి బాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో గమనించాలి. కేవలం జగన్ మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా?
మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. రూ.2 లక్షల కోట్లు పెట్టి, ఆచరణలో సాధ్యంకాని భ్రమరావతిని ఊహించుకోవడం కంటే ఇది చాలా ముఖ్యం.
కేవలం రూ.20 వేల కోట్లతో ఇది గ్రోత్ ఇంజిన్‌గా తయారవుతోందని ఆచరణ సాధ్యమైన ప్రతిపాదన చేశారు. దానికే కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో టీడీపీ నేతలు విపరీతంగా ట్రోలింగ్ చేయిస్తున్నారు. నీచాతినీచంగా టీడీపీ మూకలు ట్రోలింగ్ చేయిస్తూ వికృతానందం పొందుతున్నాయి. మంత్రులు, చోటా మోటా నాయకులు అయిపోయిన తర్వాత పచ్చ మీడియాను రంగంలోకి దించారు.
కండకావరంతో, కొవ్వెక్కి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎంతటి అవమానకరంగా మాట్లాడినా శాంతియుతంగా నిరసన తెలపండని వైఎస్ జగన్ మాకు చెప్పారు’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.


