ఎన్నికల ప్రతి దశను హైజాక్‌ చేసిన చంద్రబాబు, పోలీస్, ఎస్‌ఈసీలకు అభినందనలు | YSRCP President YS Jagan on every phase of the election | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రతి దశను హైజాక్‌ చేసిన చంద్రబాబు, పోలీస్, ఎస్‌ఈసీలకు అభినందనలు

Nov 4 2026 4:56 AM | Updated on Nov 4 2026 4:56 AM

YSRCP President YS Jagan on every phase of the election

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎద్దేవా 

నామినేషన్లు హైజాక్‌! నామినేషన్ల పరిశీలన హైజాక్‌!  

నామినేషన్ల ఉపసంహరణ హైజాక్‌! పోలింగ్‌ ఏజెంట్లను బయటకు లాగేశారు! 

పోలింగ్‌ రోజున రిగ్గింగ్‌! పోలింగ్‌ శాతం తారుమారు! ఓట్ల లెక్కింపూ హైజాక్‌!  

ప్రతిపక్షానికి పోటీపడే అవకాశం ఇవ్వకుండా ఎన్నికల్లో అద్భుతంగా గెలిచారు 

అభ్యర్థులను మీరెన్నుకున్నారే తప్ప ప్రజలు ఎన్నుకోలేదు

సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా అక్రమాలు, అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు అభినందనలు తెలుపుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మీరంతా కలిసి ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఎన్నికల్లో పోటీపడే అవకాశమే ఇవ్వకుండా అద్భుతంగా ఎలా గెలవాలో నిరూపించారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఎన్నికల ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయడానికి సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ ‘చంద్రబాబు జంగిల్‌రాజ్‌’ హ్యాష్‌ ట్యా­గ్‌తో.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)ను ట్యాగ్‌ చేస్తూ మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

ఆ పోస్టు­లో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘‘అభినందనలు.. నారా చంద్ర­బాబునాయుడి బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు! ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్‌ చేశారు. నామినేషన్లు హైజాక్‌! నామినేషన్ల పరిశీలన హైజాక్‌! నామినేషన్ల ఉపసంహరణ హైజాక్‌! పోలింగ్‌ ఏజెంట్లు అందరినీ అడ్డుకున్నారు.. బలవంతంగా బయటకు లాగేశారు! పోలింగ్‌ రోజున రిగ్గింగ్‌ చేశారు! పోలింగ్‌ శాతం తారుమారు చేశారు! ఓట్ల లెక్కింపునూ హైజాక్‌ చేశారు! అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు! అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే!’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement