‘కార్మిక సంఘాలను లోకేష్‌ అవమానించారు’ | YSRCP Leader Gudivada Amarnath Fires On Nara Lokesh Over His Comments With Vizag Steel Plant Union Leaders | Sakshi
Sakshi News home page

‘కార్మిక సంఘాలను లోకేష్‌ అవమానించారు’

Jun 9 2026 11:39 AM | Updated on Jun 9 2026 3:17 PM

Ysrcp Leader Gudivada Amarnath Fires On Nara Lokesh

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రెడ్‌బుక్‌ అరాచకం నడుస్తోందని.. లోకేష్‌ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. కార్మిక సంఘాలను లోకేష్‌ అవమానించారని.. వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడారంటూ ధ్వజమెత్తారు. స్టీల్‌ప్లాంట్‌ బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని కూటమి గాలికొదిలేసిందని అమర్‌నాథ్‌ ఆగ్రహవం వ్యక్తం చేశారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అరకు ఎంపీ తనూజ రాణి డిమాండ్‌ చేశారు. ప్రమాదానికి భద్రతా వైఫల్యాలే కారణమా..?. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలి. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి. బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తనూజ రాణి అన్నారు.

కార్మిక సంఘాలపై లోకేష్ చీప్ కామెంట్స్ ఇచ్చిపడేసిన గుడివాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement