సింహాచలం బాధిత కుటుంబాలకు YSRCP ఆర్థిక సాయం | YSRCP Financial Aid to Simhachalam Victims | Sakshi
Sakshi News home page

సింహాచలం బాధిత కుటుంబాలకు YSRCP ఆర్థిక సాయం

Apr 30 2025 9:36 PM | Updated on May 1 2025 1:10 PM

YSRCP Financial Aid to Simhachalam Victims

గుంటూరు, సాక్షి: సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరోవైపు చంద్రంపాలెంలో బాధిత కుటుంబాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పరామర్శించిన ఓదార్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే సింహాచలం అప్పన్న ఆలయంలో ఏడుగురి ప్రాణాలు పోయేందుకు కారణమైందని మండిపడ్డారు.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement